వారెవ్వా.. మళ్లీ 10,000కు నిఫ్టీ!

వారెవ్వా.. మళ్లీ 10,000కు నిఫ్టీ!

దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంటు కారణంగా మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. మూడు రోజులుగా బుల్‌ ఆపరేటర్లు పైచేయి సాధిస్తుండటంతో ఇండెక్సులు కొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 10,000 పాయింట్ల మైలురాయిని అందుకోగా.. ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా వెనకడుగులో ముగిసింది. ఇందుకు ఎఫ్‌అండ్‌వో జూలై సిరీస్‌ ముగింపు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రస్తుతం నిఫ్టీ మరోసారి 10,000 పాయింట్ల మైలురాయిని తాకింది. 35 పాయింట్లు పెరిగి వరుసగా రెండో రోజు 10,000 పాయింట్ల చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. కాగా.. సెన్సెక్స్‌ సైతం 101 పాయింట్లు పుంజుకుని 32,329 వద్ద కదులుతోంది.
ఎఫ్‌అండ్‌వో షేర్ల తీరిదీ
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, రియల్టీ రంగాలు 1.4 శాతం చొప్పున బలపడ్డాయి. ఎఫ్‌అండ్‌వో షేర్లలో జేపీ 7 శాతం జంప్‌చేయగా.. జిందాల్‌ స్టీల్‌, సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, సుజ్లాన్‌, జీఎస్‌ఎఫ్‌సీ, అదానీ పవర్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, హెక్సావేర్‌, వీగార్డ్‌,  గెయిల్ 5-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే దివీస్‌ 4 శాతం పతనంకాగా.. ఎంఆర్‌పీఎల్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, కేపీఐటీ, ఐడియా, రెప్కో హోమ్‌, పీఎఫ్‌సీ, నిట్‌ టెక్‌, టాటా కమ్యూనికేషన్స్‌ 4-1.3 శాతం మధ్య నష్టపోయాయి. Most Popular