ఎఫ్ఎంసీజీ మినహా అన్నిటికీ లాభాలే!

ఎఫ్ఎంసీజీ మినహా అన్నిటికీ లాభాలే!


మార్కెట్లు ఇవాళ రికార్డుల మోత మోగించిన సమయంలోనే.. అనేక రంగాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. సిగరెట్లపై సుంకం పెంచనున్నారన్న అంచనాలతో.. హెవీ వెయిట్ స్టాక్ ఐటీసీ 3 శాతంపైగా నష్టపోవడంతో.. ఎఫ్ఎంసీజీ సెక్టార్ 1.5 శాతం క్షీణించింది. కేపిటల్ గూడ్స్ రంగం స్వల్ప నష్టాలను నమోదు చేసింది. 

మెటల్స్, ఐటీ, టెక్నాలజీ సెక్టార్‌లు దాదాపు 1 శాతం లాభాలతో మార్కెట్లను నడిపించాయి. బ్యాంకింగ్, ఆటమొబైల్, హెల్త్‌కేర్ షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

నిఫ్టీలో ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్, వేదాంత, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జీ ఎంటర్టెయిన్మెంట్ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. ఐటీసీ, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, గెయిల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. Most Popular