సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత

సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత


సెన్సెక్స్, నిఫ్టీలు ఇవాళ కొత్త రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఇండెక్స్‌లు.. క్లోజింగ్‌లో కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. అయితే.. హైయర్ లెవెల్స్‌లో మదుపర్ల లాభాల స్వీకరణ కారణంగా.. ఇంట్రాడేలో లభించిన లాభాలను నిలబెట్టుకోవడం సాధ్యం కాలేదు. అయినా సరే ఇండెక్స్‌లు క్లోజింగ్‌లో కొత్త రికార్డులు నమోదు చేయడం విశేషం.

ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలు గడించిన సెన్సెక్స్.. 32,131.92 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని అందుకుంది. ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమై.. చివరకు 32074.78 దగ్గర ముగిసింది. 0.17 శాతం లాభంతో 54.03 పాయింట్లను సెన్సెక్స్ గడించింది. 

ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇవాళ ఇంట్రాడే.. క్లోజింగ్ రికార్డులు నమోదు చేసింది. తొలిసారిగా 9900 పాయింట్లకు ఎగువన ముగిసిన నిప్టీ.. ఇంట్రాడేలో 9,928.20 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసే సయమానికి 0.3 శాతం పెరిగిన నిఫ్టీ 29.6 పాయింట్ల లాభంతో 9915.65 దగ్గరకు చేరుకుంది. Most Popular