జూబిలెంట్ ఫుడ్‌కు క్యూ1 జోష్

జూబిలెంట్ ఫుడ్‌కు క్యూ1 జోష్


జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్ భారీ లాభాలను గడిస్తోంది. ఇవాల్టి ట్రేడింగ్‌లో ఈ షేర్ ధర దాదాపు 8 శాతం పెరగడం విశేషం. ప్రస్తుతం ఈ స్టాక్ ధర బీఎస్ఈలో 7.72 శాతం లాభంతో రూ. 1256 దగ్గర ట్రేడవుతోంది.

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభాలు రూ. 23.84 కోట్లకు  పెరిగాయని ప్రకటించడం.. ఈస్టాక్‌లో కొనుగోళ్లకు కారణమైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభాలు రూ. 18.99 కోట్లుగా నమోదయ్యాయి.

నికర ఆదాయం 11.5 శాతం పెరిగి రూ. 679 కోట్లుగా నమోదు కాగా.. ఎబిటా రూ. 79.6 కోట్లకు చేరుకుంది. నిర్వహణా మార్జిన్లు 11.7 శాతంగా ఉన్నాయి. 
 Most Popular