సిగరెట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి

సిగరెట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి


సిగరెట్ తయారీ కంపెనీలు అయిన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ వంటి షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. సిగరెట్లపై కాంపెన్సేషన్ సెస్ పెంచే ప్రతిపాదనను జీఎస్‌టీ కౌన్సిల్ ప్రతిపాదించనుందన్న వార్తల కారణంగా.. ఈ షేర్లలో అమ్మకాలు పెరిగాయి.

కొత్త ట్యాక్సింగ్ విధానం ప్రకారం.. ఈ కంపెనీలపై పన్ను భారం పెరగనుందని, సిగరెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉందన్న వార్తల కారణంగా.. సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి.

2.91 శాతం నష్టపోయిన ఐటీసీ రూ. 327.35 దగ్గర ట్రేడవుతుండగా.. 1.37 శాతం క్షీణించిన గాడ్‌ఫ్రే ఫిలిప్ రూ. 1242.85 దగ్గర నిలిచింది. 0.8శాతం నష్టపోయిన వీఎస్‌టీ ఇండస్ట్రీస్ రూ. 3581.90 దగ్గర ట్రేడవుతోంది.Most Popular