9900 పైనే నిఫ్టీ

9900 పైనే నిఫ్టీ


స్టాక్ మార్కెట్లు స్థిరంగా లాభాలతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని సెక్టార్లలో కొనుగోళ్లు జరుగుతుండడంతో.. సూచీలు లాభాలతో ట్రేడవుతున్నాయి. మెటల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లలోని షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి.

ప్రధాన ఇండెక్స్‌ షేర్లలో కొనుగోళ్ల కారణంగా.. నిఫ్టీ 9900 పాయింట్ల ఎగువనే కొనసాగుతోంది. ప్రస్తుతం 28 పాయింట్ల లాభంతో ఉన్న నిఫ్టీ 9914 దగ్గర ట్రేడవుతోంది. 68 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 32089 దగ్గర ట్రేడవుతోంది.

స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు పాజిటివ్ జోన్‌లోనే ఉన్నా.. కొనుగోళ్లు, అమ్మకాలు సమానంగా జరుగుతున్నాయి.Most Popular