ఈ డాక్టర్.. ఓ అద్భుతమైన స్టాక్ పికర్ !

ఈ డాక్టర్.. ఓ అద్భుతమైన స్టాక్ పికర్ !

పేషెంట్ల జబ్బును సులువుగా పట్టేసే ఓ డాక్టర్.. స్టాక్ మార్కెట్లోనూ అలాంటి సక్సెస్‌నే ఎంజాయ్ చేస్తున్నారు. రోగులకు ఉన్న అనారోగ్యాన్ని గుర్తించినట్టే.. కంపెనీలకు ఉన్న ఇబ్బందులనూ గుర్తించి మంచి స్టాక్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆయనే డాక్టర్ విజయ్ మాలిక్. పేరులోనే విజయం ఉన్న ఆయన వ్యూహాలేంటో మీరూ చూడండి. 

మంచి క్వాలిటీ స్టాక్స్‌ను ఎంపిక చేయడానికి 'బాటమ్ అప్' వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారు. దీన్ని ''పీస్‌‌ఫుల్ ఇన్వెస్టింగ్‌''గా అభివర్ణిస్తారు మాలిక్. ఇదే 
టెక్నిక్‌తో కొన్నేళ్లుగా ఏడాదికి 50 శాతం రాబడిని ఆర్జిస్తున్నారు. 

డాక్టర్ గారి దగ్గర అనారోగ్యకరమైన వ్యాపారాలను గుర్తించే డయాగ్నస్టిక్ కిట్‌ లాంటిది ఉందంటారు ఓ ఫాలోయర్. తక్కువ స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడం, వాటిని తరచూ మానిటర్ చేయడం, వాటిల్లోనే ఏవైనా అవకాశాలు ఉంటే గుర్తించి మరిన్ని స్టాక్స్ తీసుకోవడమో, తగ్గించుకోవడమో చేసుకోవడమే లాభాలను పెరగడానికి దోహదపడ్తోందని మాలిక్ ఫ్యాన్స్ చెబ్తుంటారు. 

డాక్టర్ విజయ్ మాలిక్ మార్కెట్లలో గత తొమ్మిదేళ్ల నుంచి యాక్టివ్‌గా ఉన్నా పెద్దగా తన పోర్ట్‌ఫోలియోలో మార్పు-చేర్పులు చేసుకున్న దాఖలాలు తక్కువగానే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలోనే అతని పిక్స్ 10 రెట్లకు మించి లాభాలను అందించాయి. వాటిల్లో 6 స్టాక్స్‌ ఏకంగా 8-12 రెట్లు లాభాలను పంచాయి. 

'' వంద రెట్ల లాభాలను అందించే స్టాక్‌ను మన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలంటే ముందుగా సదరు ఇన్వెస్టర్.. అది 1, 2, 5, 10, 20, 50 రెట్లు పెరిగిన తర్వాత కూడా తన దగ్గర ఆ స్టాక్‌ను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ మనం కొన్న ప్రైస్‌ ఎంత.. లాభమెంత అనే అంశాన్ని చూడకూడదు. ప్రస్తుతం సదరు సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మాత్రమే మనం చూడడం మంచిది '' - డా. విజయ్ మాలిక్. 

మాలిక్ పిక్ చేసిన స్టాక్స్‌లో మయూర్ యునికోటర్స్ ఏకంగా 67 లాభాలను అందించింది. 2012-2016 మధ్య రూ.41 యావరేజ్‌లో (స్ప్లిట్, బోనస్ అడ్జస్ట్‌మెంట్)లో కొని రూ.400ల్లో అమ్ముకుని (ఏప్రిల్ 2016) సొమ్ము చేసుకున్నారు. 

ఇండాగ్ రబ్బర్ కూడా 300 శాతం లాభాలను అక్టోబర్ 2013-జనవరి 2017 మధ్యకాలంలో అందించింది. 

ఘనమైన గతాన్ని పట్టించుకోవాల్సిందే - 
స్థిరమైన ఆదాయం, కొద్దిగానైనా పెరుగుతున్న లాభదాయకత, మార్జిన్లు, ఫ్రీ క్యాష్ ఫ్లో వంటివి ఎంతో ముఖ్యం. వీటిని నిత్యం పరిశీలిస్తూ ఉంటే.. సదరు కంపెనీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీయా.. కాదా.. అనే అంశంపై మనం ఓ నిర్ణయానికి రావొచ్చు. 

వీటితో పాటు వేల్యుయేషన్, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ, క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్, మీడియా ఆర్టికల్స్‌ను కూడా మనం ఎప్పటికప్పుడు చదువుతూ ఉండడం మంచిది. 

మీపై, మీ స్టాక్ ఎంపికపై నమ్మకం ఉంచండి - 
మనం ఎంపిక చేసిన కంపెనీ రాబడిని అందిచేందుకు కొద్ది సమయాన్ని ఇవ్వాలి. అంతవరకూ ఓపిక పట్టాలి. మనపై మనకూ నమ్మకం ఉండాలంటారు మాలిక్. ఆగస్ట్ 2008లో జెకె లక్ష్మి సిమెంట్ రూ.40 (స్ప్లిట్ ప్రైస్)లో కొనడం మొదలుపెట్టారు. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ఆ స్టాక్ రూ.15 వరకూ పతనమైంది. అయినప్పటికీ స్టాక్‌ను వివిధ దశల్లో కొంటూ రూ.17.5 దగ్గర యావరేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే స్టాక్‌ను డిసెంబర్ 2009లో రూ.69కి అమ్మేశారు. 

ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత మార్కెట్లపై మక్కువ పెంచుకున్న డాక్టర్ మాలిక్.. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్, సిఎఫ్ఏ (థర్డ్ లెవెల్) పూర్తిచేశారు. ప్రస్తుతం సెబీ రిజిస్టర్డ్ ఎనలిస్ట్‌గా ప్రీమియం క్లైంట్స్‌కు సేవలు అందిస్తున్నారు. 


 Most Popular