స్వల్ప లాభాలతో యూరప్‌ షురూ

స్వల్ప లాభాలతో యూరప్‌ షురూ

శుక్రవారం నీరసంగా ముగిసిన యూరప్ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా మొదలయ్యాయి. ప్రస్తుతం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ 0.15 శాతం స్థాయిలో బలపడి కదులుతున్నాయి. చైనా ద్వితీయ త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాలను మించుతూ 6.9 శాతం వృద్ధి సాధించడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లోనూ చైనా ఆర్థిక వ్యవస్థ ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. 
మరోవైపు యూకే బ్రెక్సిట్‌ సెక్రటరీ డేవిడ్‌ డేవిస్‌ యూరోపియన్‌ యూనియన్‌ అధికారి మైఖేల్‌ బార్నియర్‌తో నేటి నుంచి రెండో రౌండు చర్చలు మొదలుపెట్టనున్నారు. బ్రస్సెల్స్‌లో జరగనున్న ఈ సమావేశంలో భాగంగా నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.Most Popular