సలసర్‌ టెక్నో ఐపీవోకు గుడ్‌ రెస్పాన్స్‌!

సలసర్‌ టెక్నో ఐపీవోకు గుడ్‌ రెస్పాన్స్‌!

సలసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి తగిన స్పందన లభిస్తోంది. ఈ నెల 12న మొదలైన ఐపీవో నేడు(17న) ముగియనుంది. రూ. 108 ఫిక్స్‌డ్‌ ధర ప్రాతిపదికన కంపెనీ చేపట్టిన ఐపీవో చివరి రోజు ఉదయం 11 వరకూ 14 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 33.21 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.77 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇన్వెస్టర్లు కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై రూ. 2 లక్షల మొత్తం మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
కంపెనీ వివరాలివీ
సలసర్‌ టెక్నో ప్రధానంగా టెలికం, విద్యుత్‌ ప్రసార టవర్ల తయారీలో ఉంది. వీటితోపాటు విద్యుత్‌ సబ్‌స్టేషన్ స్ట్రక్చర్లు, సోలార్‌ మాడ్యూల్‌ స్ట్రక్చర్లు తదితరాలను సైతం రూపొందిస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా గాల్వనైజ్‌డ్‌ స్టీల్ ప్రోడక్లుల తయారీ‌, ఇంజినీరింగ్, డిజైనింగ్‌, ఫ్యాబ్రికేషన్‌ తదితర సేవలను అందిస్తోంది. తద్వారా టెలికం, విద్యుత్‌ టవర్లు, మోనో పోల్స్‌, గార్డ్‌ రైల్స్‌ తదితరాలను తయారు చేస్తోంది. కస్టమర్లలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ టవర్స్‌, రిలయన్స్‌ జియో తదితర సంస్థలున్నాయి.Most Popular