ఆర్డర్లతో రోల్టా ఇండియా జోరు

ఆర్డర్లతో రోల్టా ఇండియా జోరు

మధ్యప్రాచ్యం నుంచి ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో రోల్టా ఇండియా కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 62.30 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 64 వరకూ ఎగసింది. 
ట్రాన్సాఫార్మేషనల్‌ జియోస్పేటియల్‌ సొల్యూషన్‌ సేవల కోసం మధ్యప్రాచ్యం నుంచి దాదాపు 11 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 72 కోట్లు) కాంట్రాక్ట్‌ లభించినట్లు కంపెనీ తెలియజేసింది.  జీఐఎస్ నుంచి‌, మేపింగ్‌ డేటా వరకూ మొత్తం బిజినెస్‌ సిస్టమ్స్‌ను ఇంటిగ్రేట్‌ చేసేందుకు తమ సేవలు ఉపయోగపడనున్నట్లు కంపెనీ తెలియజేసింది. Most Popular