మార్కెట్ల సరికొత్త రికార్డులు!

మార్కెట్ల సరికొత్త రికార్డులు!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్టాలను అందుకున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగియగా.. చైనా క్యూ2 జీడీపీపై దృష్టిపెట్టిన ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 32,132 వద్ద, నిఫ్టీ 9,920 వద్ద ఆల్‌టైమ్‌ 'హై'లను తాకాయి. 
సెన్సెక్స్‌ సెంచరీ
ప్రస్తుతం సెన్సెక్స్‌ 106 పాయింట్లు పెరిగి 32,127కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 9,919 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్యాంక్‌ నిఫ్టీ సైతం 71 పాయింట్లు ఎగసి 24,009కు చేరింది. ఐటీ 1.4 శాతం, మెటల్‌ 0.9 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున బలపడినప్పటికీ ఎఫ్‌ఎంసీజీ రంగం 1.4 శాతం క్షీణించడంతో మార్కెట్ల లాభాలు పరిమితమయ్యాయి. 
బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐటీసీ, గెయిల్‌, ఐవోసీ, యాక్సిస్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, అరబిందో 2.4-0.4 శాతం మధ్య నష్టపోయాయి.Most Popular