ఆసియా మార్కెట్లు సానుకూలం‌!

ఆసియా మార్కెట్లు సానుకూలం‌!

చైనా ద్వితీయ త్రైమాసిక ఆర్థిక పురోగతిపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యమివ్వడంతో పలు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు పటిష్ట లాభాలతో ముగియడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెరైన్‌ డే సందర్భంగా జపాన్‌ మార్కెట్‌కు సెలవుకాగా.. చైనా జీడీపీ తొలి క్వార్టర్‌లో 6.9 శాతం వృద్ధి సాధించింది. ఇది అంచనాలను మించడంతో క్యూ2 జీడీపీపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 95.09కు బలహీనడింది. జపనీస్‌ కరెన్సీ యెన్‌తో మారకంలో 113 వద్ద డాలరు కదులుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, కొరియా, సింగపూర్‌, తైవాన్ 0.6-0.2 శాతం మధ్య బలపడగా... థాయ్‌లాండ్‌, ఇండొనేసియా నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి. చైనా 0.1 శాతం బలహీనపడి ట్రేడవుతోంది. Most Popular