కర్ణాటక బ్యాంక్‌కు బకాయిల దెబ్బ

కర్ణాటక బ్యాంక్‌కు బకాయిల దెబ్బ

ప్రయివేట్‌ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలు అందుకోకపోవడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యమివ్వడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 160 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ నికర లాభం 10 శాతం మాత్రమే పెరిగి రూ. 134 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం పుంజుకుని రూ. 424 కోట్లను తాకింది. అయితే నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.64 శాతం నుంచి 3.2 శాతానికి పెరగడంతో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. స్థూల ఎన్‌పీఏలు సైతం 4.21 శాతం నుంచి 4.34 శాతానికి పెరిగాయి.Most Popular