భన్సాలీ ఇంజినీరింగ్‌కు ఫలితాల కిక్‌

భన్సాలీ ఇంజినీరింగ్‌కు ఫలితాల కిక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన భన్సాలీ ఇంజినీరింగ్‌ పాలిమర్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.6 శాతం జంప్‌చేసి రూ. 81.25 వద్ద ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ నికర లాభం 111 శాతం దూసుకెళ్లి రూ. 17 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం సైతం 52 శాతం ఎగసి రూ. 224 కోట్లను అధిగమించింది.Most Popular