బైబ్యాక్‌ ప్రతిపాదనతో విప్రో దూకుడు!

బైబ్యాక్‌ ప్రతిపాదనతో విప్రో దూకుడు!

దేశీ ఐటీ దిగ్గజాల బాటలో సాఫ్ట్‌వేర్‌ సేవల బ్లూచిప్‌ విప్రో సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. దీంతో విప్రో కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.35 శాతం జంప్‌చేసి రూ. 271 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 274 వరకూ ఎగసింది. గురువారం(20న) నిర్వహించనున్న బోర్డు సమావేశంలో బైబ్యాక్‌ ప్రతిపాదనపై చర్చించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. Most Popular