యూఎస్‌ మార్కెట్ల లాభాల ముగింపు!

యూఎస్‌ మార్కెట్ల లాభాల ముగింపు!

బ్యాంకింగ్‌ ప్రధాన సంస్థలు సిటీగ్రూప్‌, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, వెల్స్‌ఫార్గో ప్రకటించిన ద్వితీయ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పటిష్ట లాభాలతో ముగిశాయి. తాజాగా వెల్లడైన ద్రవ్యోల్బణ గణాంకాలు మందగించడంతో ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఆలస్యంకావచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడింది. ఈ నేపథ్యంలో డోజోన్స్‌ 85 పాయింట్లు బలపడి 21,638 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 21,681ను తాకింది. వాల్‌మార్ట్‌ 2 శాతం జంప్‌చేయడం ఇందుకు సహకరించగా.. ఎస్‌అండ్‌పీ 11 పాయింట్లు పుంజుకుంది. 2464 వద్ద ముగిసింది. ఇది రికార్డు గరిష్టంకాగా.. నాస్‌డాక్‌ సైతం 38 పాయింట్లు పెరిగి 6312 వద్ద స్థిరపడింది.Most Popular