మార్కెట్లకు బ్యాంకింగ్‌, ఐటీ అండ!

మార్కెట్లకు బ్యాంకింగ్‌, ఐటీ అండ!

ఐటీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాలు 0.7-02 శాతం మధ్య పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు బలమొచ్చింది. ఐతే ఎఫ్‌ఎంసీజీ దాదాపు 1 శాతం నష్టపోవడం ద్వారా లాభాలను పరిమితం చేసింది. ప్రస్తుతం నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 9,915ను తాకింది. సెన్సెక్స్‌ సైతం 90 పాయింట్లు పురోగమించి 32,111 వద్ద ట్రేడవుతోంది.
దిగ్గజాల తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్‌, జీ, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, వేదాంతా, అంబుజా, ఐసీఐసీఐ 2.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క గెయిల్‌, ఐటీసీ, అరబిందో, ఇండస్‌ఇండ్, బీవోబీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ 2-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. Most Popular