లాభాల ఓపెనింగ్‌-బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌

లాభాల ఓపెనింగ్‌-బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 9,900 పాయింట్ల మార్క్‌ను అధిగమించగా.. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 24,000కు ఎగువకు చేరింది. తద్వారా మార్కెట్‌ చరిత్రలో తొలిసారి రికార్డ్‌ ఫీట్‌ను సాధించింది.

దేశీయంగా బలపడ్డ సెంటిమెంటు, విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 74 పాయింట్లు పెరిగి 32,095కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్లు పుంజుకుని 9,910 వద్ద ట్రేడవుతోంది.

24,018 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 23,995 వద్ద కదులుతోంది.Most Popular