ఈ వారం ఇవే కీలకం !

ఈ వారం ఇవే కీలకం !

మార్కెట్లను సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ ట్రేడర్లు, ఇన్వెస్టర్లను ఉత్సాహపరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఏ దశలోనూ బుల్స్ వెనక్కితగ్గేందుకు సిద్ధపడడం లేదు. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ ఆల్ టైం గరిష్ట స్థాయిల దగ్గర తొణకని నిండు కుండలో స్థిరంగా కనబడ్తున్నాయి. 9500 - 9700 పాయింట్ల మధ్య చాలాకాలం పాటు కొట్టుమిట్టాడిన మార్కెట్లు ఈ వారం ఒడ్డున పడేశాయి. ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు లాభపడి సెన్సెక్స్ ఏకంగా 660 పాయింట్లు, నిఫ్టీ 221 పాయింట్లు ముందుకు దూసుకెళ్లాయి. చివరి ట్రేడింగ్ సెషన్‌లో కాస్త ఉత్సాహం సన్నగిల్లినా గత వారం మాత్రం జోష్ కనిపించింది. ఇన్ఫోసిస్, టిసిఎస్ లాంటి కంపెనీలు నిరుత్సాహపరచడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. 

మరి ఈ వారం ఎలా ?
ఎర్నింగ్స్ సీజన్ వేడి మొదలైపోయింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి రెండు పెద్ద కంపెనీలు తమ నెంబర్స్‌ను ప్రకటించేశాయి. సోమవారం ఎసిసి, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ - మంగళవారం క్రిసిల్, అల్ట్రాటెక్ సంస్థలు ఫలితాలను ప్రకటించబోతున్నాయి. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌ గురువారం రోజున, అశోక్ లేల్యాండ్ శుక్రవారం రోజున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. 

రిలయన్స్ డైరెక్షన్ - గురువారం రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలను మార్కెట్ ఆసక్తిగా గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో రూ.1500 మార్కు దాటిన తర్వాత కూడా ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఇంకా నీరసించినట్టు కనిపించలేదు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లతో పాటు జియో పనితీరు విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే ఈ స్టాక్ మరింత దూసుకుపోవచ్చు. అప్పుడు మార్కెట్‌కు కూడా ఈ స్టాక్ దిశానిర్దేశం చేయవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి కూడా అలానే తారుమారు కావొచ్చు. 

ఈ గురువారం (జూలై 20వ తేదీన) బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ కమర్షియల్ బ్యాంక్‌లు భేటీ కాబోతున్నాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మార్కెట్లు ప్రభావితం కావొచ్చు. ప్రస్తుతానికైతే రెండు దేశాలూ యధాతధస్థితివైపే మొగ్గుచూపొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Most Popular