అక్కడ గొడుగులు కూడా అద్దెకి ఇస్తారు

అక్కడ గొడుగులు కూడా అద్దెకి ఇస్తారు

స్టార్టప్ కంపెనీల ఐడియాలు కొన్ని తమాషాగా అన్పిస్తాయ్. వాటిలో కొన్నిటిని జనం ఆదరిస్తుంటారు కూడా..ఐతే చైనాలో మాత్రం ఓ స్టార్టప్ కంపెనీ యూజర్ల రెస్పాన్స్ బాగానే ఉన్నా..లబోదిబోమంటోంది..అదెలా మీరే చూడండి

చైనాలో షేరింగ్‌పైనే సగం మంది బతుకున్నారంటే ఆశ్చర్యం లేదు. అందుకే అక్కడ బైక్ షేరింగ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన స్టార్టప్ బాగా సక్సెస్అయింది..మనకి లేదు కానీ ఇతర దేశాల్లో కూడా బైక్ ,షేరింగ్, ఉంది. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తోనే అంబ్రెల్లా షేరింగ్ స్టార్టప్ ఒకటి చైనాలో ప్రారంభమైంది. బైటికి వెళ్లినప్పుడు సడన్ గా వర్షం ప్రారంభమవుతుంది..తడవకుండా రావాలంటే సాధ్యపడే పని కాదు..మరి అప్పుడెలా..అలాంటివారికోసమే ఓ యునిక్ కాన్సెప్ట్ అన్నమాట ఇది

వర్షం పడటం ఆ తర్వాత ఈ కంపెనీ గొడుగులు వాడుకోవడం వరకూ బానే ఉంది..ఆ తర్వాతే అసలు సమస్య వస్తోంది. ఎవరు ఈ గొడుగులు తీసుకున్నా తిరిగి ఇవ్వడం లేదట..కాస్త నదురుగా కన్పిస్తే చాలు నొక్కేయడమే పనిగాపెట్టుకున్నారట..దీంతో స్టార్టప్ ప్రారంభమైన ఏడాదిలోనే 30వేల గొడుగులు ఇలా పోయాయట. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా పని చేస్తుందంటే ముందుగా యూజర్లు 19యువాన్లు సదరు కంపెనీకి డిపాజిట్ చేయాలి..అంటే మన కరెన్సీలో దాదాపుగా 195 రూపాయలన్నమాట..ఇలా కట్టిన తర్వాత కంపెనీ యాప్ డౌన్ లోడ్ చేస్కోవాలి..ఆ యాప్ ‌తో గొడుగుపై ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి..ఇలా చేస్తేనే అంబ్రెల్లా లాక్ ఓపెన్ అవుతుంది. ఇలా గొడుగులు అరగంట వాడుకున్నందుకు ఆప్ యువాన్ అద్దెగా తీసుకుంటారట. అంటే దాదాపుగా ఆరు రూపాయలతో సమానం..చాలా చీప్ కదా..ఐతే చైనీస్ మైండ్ లో మాత్రం వేరే ఉంది..గొడుగు సూపర్ గా ఉంది ఎందుకు తిరిగిచ్చేయడం అనుకుని చక్కా పోతున్నారట....ఐనా సరే కంపెనీ ప్రమోటర్  జావో షుపింగ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మరో లక్ష గొడుగులకు ఆర్డరిస్తున్నాడటMost Popular