ఎలాంటి వడ్డీ లేకుండా మెడికల్ లోన్ పొందొచ్చు !

ఎలాంటి వడ్డీ లేకుండా మెడికల్ లోన్ పొందొచ్చు !

జన జీవనశైలిలో వస్తున్న అసాధారణ మార్పుల కారణంగా.. పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. వీటిని భరించడం క్లిష్టంగా మారిపోతోంది. హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ అనే మాట ముందు నుంచి వినిపిస్తున్నా.. మెడికల్ లోన్స్‌కి మాత్రం ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. అన్‌సెక్యూర్డ్ రుణాలు అయినా.. వీటికి పలు ఆర్థిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. తగిన ఆదాయ ధృవీకరణ పత్రం, ముందుగా నిర్ణయించిన జాబితాలో ఉన్న వ్యాధులకు సంబంధించిన సర్జరీలకు వీటిని పొందవచ్చు. 

వడ్డీ రేటు ఎంత?
మన దేశంలో ఆరోగ్య బీమా సదుపాయం పొందిన వారి శాతం చాలా తక్కువ. పేదలు.. మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చులకు సంబంధించిన భద్రతను పొందడం లేదు. వీరిలో చాలామంది అత్యవసర ఖర్చుల కోసం పర్సనల్‌ లోన్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ తరహా లోన్ ప్రొడక్టులకు భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వ్యక్తిపైనే కాదు.. మొత్తం కుటుంబంపై భారం మోపుతుంది. 

రూ. 20 వేల నుంచి రూ. 5 లక్షల మొత్తం వరకు వైద్య రుణాలను పొందే అవకాశం ఉంది. సహజంగా వీటిని 0% వడ్డీ రేటుకే పొందచ్చు లేదా అతి తక్కువ వడ్డీ రేటుకు పొందవచ్చు. పర్సనల్ లోన్స్‌ ద్వారా అందే మొత్తాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తే.. ఈ తరహా మెడికల్ లోన్స్‌ దుర్వినియోగం కాకుండా.. వైద్యం చేసిన ఆస్పత్రికి బిల్లు సమర్పించిన తర్వాత చెల్లిస్తారు. 

రుణం తీరు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు.. 2-3 రోజుల స్వల్ప వ్యవధిలోనే మెడికల్ లోన్స్‌ను మంజూరు చేస్తున్నాయి. సహజంగా ఈ తరహా రుణాలలో 2 ఈఎంఐలను ముందస్తుగా దరఖాస్తుదారుడు చెల్లించాల్సి ఉంటే.. మిగిలిన మొత్తాన్ని 10 సులభ వాయిదాల్లో కట్టాలి. అలాగే సబ్‌వెన్షన్ ఫీ రూపంలో 7-9 శాతం ఆస్పత్రులు చెల్లిస్తాయి. ఉదాహరణకు రూ. 1.5 లక్షల మెడికల్ లోన్ తీసుకుంటే రూ. 15వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ రుణాలలో వడ్డీ భారాన్ని.. సబ్‌వెన్షన్ ఫీ రూపంలో ఆస్పత్రులు చెల్లించడం విశేషం. అయితే.. ఈ సబ్‌వెన్షన్ ఫీజు నుంచి తప్పించుకునేందుకు, ఆస్పత్రులు ఎక్కువ బిల్లులు చూపే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారం.. ఆస్పత్రులు అందించే బిల్లలను పరిశీలిస్తూ.. సబ్‌వెన్షన్ ఫీజుతో సహా బిల్లులు సమర్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అర్హతలు
మెడికల్ లోన్ పొందేందుకు ఒక వేతనం పొందే ఉద్యోగి నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ వేతనం పొందుతూ ఉండాలి. ఈ మొత్తాన్ని చెక్ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది. పాన్‌ కార్డ్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్‌ వంటి ధృవీకరణ పత్రాలు రుణ దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి. స్వయం ఉపాధి పొందుతున్న వారు అయితే.. తప్పనిసరిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, నివాస ధృవీకరణ, ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ ఎగ్జిస్టెన్స్ ప్రూఫ్, వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఈ తరహా రుణాలు పొందడంలో కూడా అన్ని రకాల పత్రాలు సమర్పించినా.. సిబిల్ స్కోర్ కీలకంగా ఉంటుంది.Most Popular