మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ మెచ్చిన ఆ 2 కొత్త స్టాక్స్ ఏవో తెలుసా ?

మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ మెచ్చిన ఆ 2 కొత్త స్టాక్స్ ఏవో   తెలుసా ?

స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఎక్కడా బ్రేక్ పడడం లేదు. సెన్సెక్స్ 32 వేల పాయింట్లు దాటి పైపైకి దూకుతూ ఉంటే.. నిఫ్టీ 10 వేల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పుడు మార్కెట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉందంటూ కొంత మంది లాభాల స్వీకరణకు దిగుతుంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం సైలెంట్‌గా తమ ఫేవరెట్ స్టాక్స్‌కు పిక్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐపిఓ స్టాక్స్‌ను భారీగా తమ ఫండ్స్‌లో చేర్చుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. 

జూన్ నెలలో మ్యుచువల్ ఫండ్ సంస్థలు పెద్ద ఎత్తున స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోల్లో జమ చేసుకుంటున్నాయి. 21 సెషన్లలో రూ.9106 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. మే నెలలో పోలిస్తే కొద్దిగా ఫండ్ బయింగ్ తగ్గినప్పటికీ జోరు మాత్రం పెద్దగా తగ్గిన దాఖలాలు లేవు. 
అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. మ్యూచువల్ సంస్థలు మొట్టమొదటిసారి ఈ స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోల్లో జమ చేసుకున్నాయి. 
ఆ జాబితాలో ఎరిస్ లైఫ్‌సైన్సెస్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తేజాస్ నెట్వర్క్, డిఎఫ్ఎం ఫుడ్స్, స్టార్ సిమెంట్స్, జిటిపిఎల్ హాత్‌వే, లక్స్ ఇండస్ట్రీస్, డిష్మన్ కార్బోజెన్, జస్ట్ డయల్ ఉన్నాయి. ఈ మధ్య తాజాగా లిస్ట్ అయిన స్టాక్స్‌ను ఫండ్ హౌసులు ఎంపిక చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

ఎరిస్ లైఫ్‌సైన్సెస్ కోసం బిర్లా, ఐడిఎఫ్‌సి, మోతిలాల్ ఒస్వాల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థల ఫండ్ మేనేజర్లు పోటీ పడ్డారు. తాజాగా ఈ సంస్థలన్నీ సుమారు రూ.751 కోట్ల విలువైన స్టాక్‌ను కొనుగోలు చేసినట్టు ఐడిబిఐ రిపోర్ట్ సూచిస్తోంది. 

ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం బిర్లా, బిఎన్‌పి పరిబాస్, డిఎస్‌పి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్‌సి, కొటాక్, మోతిలాల్ ఒస్వాల్, రిలయన్స్, ఎస్బీఐ సుందరం, యూటీఐ సంస్థలు క్యూకట్టాయి. సుమారు రూ.190 కోట్ల విలువైన స్టాక్‌ను తమ పోర్ట్‌ఫోలియోల్లో జమ చేసుకున్నాయి. 

ఇదే సమయంలో ఎఫ్ఐఐలు కూడా నెట్ బయర్స్‌గా మారారు. జూన్ నెలలో సుమారు రూ.3939 కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. అదే ఈ సొమ్ము మే నెలలో మాత్రం రూ.9956 కోట్లుగా ఉంది. 

అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు పెద్ద ఎత్తున స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు కాబట్టి ఒకవేళ మార్కెట్లోనో, సదరు స్టాక్‌లోనో ఏదైనా కరెక్షన్ వచ్చినా వాళ్లు వాటిని వదులుకోకుండా హోల్డ్ చేయగల కెపాసిటీ ఉంది. అవసరమైతే కొన్ని సందర్భాల్లో యావరేజింగ్ కూడా చేసుకోగలరు. అందుకే మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల స్టాక్ ఎంపికను మీరూ పరిగణలోకి తీసుకునేముందు మీరూ వాళ్ల స్ట్రాటజీని ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడే దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే స్టాక్స్‌ను పట్టుకోగలరు. 


 Most Popular