10,200 దగ్గర నిఫ్టీకి కాల్ రైటింగ్, దేనికి సంకేతం ??

10,200 దగ్గర నిఫ్టీకి కాల్ రైటింగ్, దేనికి సంకేతం ??

నిఫ్టీ దూకుడుకు అడ్డుకట్ట పడడం లేదు. వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ ఉత్సాహంగా కదలాడిన మార్కెట్లు గరిష్ట స్థాయిల దగ్గర ముగిశాయి. నిఫ్టీ 9897 పాయింట్ల గరిష్టస్థాయి దగ్గర ముగిసి ఊరిస్తోంది. నిన్నటి రోజున గ్యాప్ అప్‌తో ప్రారంభమై డైలీ ఛార్ట్స్‌లో బులిష్ క్యాండిల్‌ను ఫార్మ్ చేసింది. 

ఇప్పుడు మరింత ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టీ 9850 పాయింట్లపైనే స్థిరంగా కొనసాగాలి. అప్పుడు 9950 ఆపై 10000 మార్కును అధిగమిస్తుంది. డౌన్‌సైడ్‌లో 9820 దగ్గర ఆ పై 9750 పాయింట్ల దగ్గర పటిష్టమైన సపోర్ట్ ఉంది. 

నిఫ్టీ 5 అంకెల మార్కును తాకేందుకు కేవలం 100-110 పాయింట్ల దూరంలో మాత్రమే ఉండగా, సెన్సెక్స్ 32 వేల పాయింట్ల మార్కును క్రాస్ చేసేసింది. 

ఆప్షన్ డేటా ఏం చెబ్తోంది 
గరిష్ట స్థాయి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 9600 -  9700 పాయింట్ల స్టైక్ ప్రైస్ దగ్గర ఉంది. ఇక కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10,000 ఆ తర్వాత 9900 దగ్గర కనిపిస్తోంది. 
ఇక 9900,9800,9700 పాయింట్ల దగ్గర పుట్ రైటింగ్ ఎక్కువగా ఉండగా... తాజాగా కాల్ రైటింగ్‌ 9,900 - 10200 దగ్గర జరుగుతోంది.
పైన చెప్పిన ఏ డేటాను విశ్లేషించినా మనకు అప్ సైడ్ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9700 వరకే పుట్స్‌కు అధిక గిరాకీ వస్తోందంటే.. అంతకు మించి పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నట్టు అనుకోవాలి. 

పుట్ -కాల్ రేషియో కూడా ఆసక్తికరంగా మారుతోంది. పిసిఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ - నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.50 స్థాయికి చేరుతోంది. ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి. పుట్ రైటర్స్ ఈ దశలో ఉత్సాహంగా, మరింత నమ్మకం, కంఫర్ట్ జోన్‌లో ఉన్నారని అర్థం చేసుకోవాలి.

లాంగ్స్ బిల్డ్ అవుతున్న కౌంటర్స్ - 
కొటక్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి, యెస్ బ్యాంక్, హిందాల్కో, యాక్సిస్, ఓల్టాస్, రిలయన్స్, హెచ్ పి సి ఎల్, ఎల్ ఐ సి హౌసింగ్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, టాటా స్టీల్. Most Popular