దీపావళి నాటికి నిఫ్టీ 10,500.. సాధ్యమేనా?

దీపావళి నాటికి నిఫ్టీ 10,500.. సాధ్యమేనా?


బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ర్యాలీ.. ప్రథమార్ధమంతా కొనసాగింది. ఇప్పుడు 2017 ద్వితీయార్ధం నాటికి ర్యాలీ కొంచెం నెమ్మదించినా.. ఇండెక్స్‌ల పరుగు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం నిఫ్టీ 9900 పాయింట్లకు అతి చేరువలో ఉండగా.. అక్టోబర్ నాటికి.. అంటే దీపావళి పండుగ సమయానికి 10,500 స్థాయిని అందుకునే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

2017 ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 19 శాతం ర్యాలీ చేశాయి. 2016 డిసెంబర్ నాటి కనిష్టం 7900తో పోల్చితే 24 శాతం మేర నిఫ్టీ పెరిగింది. రీసెంట్‌గా షార్ట్ కవరింగ్ ర్యాలీ కారణంగా మార్కెట్లు కొంత పెరిగినా, ప్రధానంగా కంపెనీల ఆదాయాలు పెరగడమే ఈ ర్యాలీకి అసలు కారణం.

“మార్కెట్లలో చిన్నపాటి కరెక్షన్, కన్సాలిడేషన్ వచ్చినపుడల్లా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అంటే ఇది బుల్ మార్కెట్‌గా అర్ధం చేసుకోవాలి. గోల్డ్ వంటి ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే, ఈక్విటీలపైనే ఇప్పుడు మదుపర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు,” అని ఆమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటోంది.

“గత 3 నెలల కాలంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు దాదాపు రూ. 15వేల కోట్ల మేర ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి. నిఫ్టీ 10వేల మార్క్‌ను అందుకునే వరకూ ఈ కొనుగోళ్లు కొనసాగే అవకాశం ఉంది”

ఈ సిరీస్‌లోనే నిఫ్టీ 9900 పాయింట్లను దాటినా.. 10వేల పాయింట్ల సైకలాజికల్ మార్క్‌ను అధిగమించడం జూలై ఎక్స్‌పైరీ లోపు కష్టం కావచ్చు. అయితే, ఆగస్ట్ సిరీస్ తొలి వారంలోనే నిఫ్టీ 10వేల పాయింట్లను అధిగమించి.. దీపావళి నాటికి 10,500ను అందుకునే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

“దీపావళి నాటికి నిఫ్టీ 10,500 పాయింట్ల టార్గెట్‌ను ఆశిస్తున్నాం. 2018 మార్చ్ నాటికి 12వేల పాయింట్లను అందుకునే అవకాశాలున్నాయి. షార్ట్ కవరింగ్‌ మోడ్‌లో ఉన్న మెగా బుల్ మార్కెట్‌లో పీఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, ఐటీ స్టాక్స్ భారీగా లాభపడే అవకాశాలున్నాయి” అని ఐడీబీఐ క్యాపిటల్ అంటోంది. 

అయితే.. ఈ ర్యాలీ సాఫీగా కనిపించకపోవచ్చని నిపుణులు అంటున్నారు. 9800 స్థాయిలో కరెక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి. అయితే 10వేల పాయింట్ల మార్క్‌ను అధిగమించి నిఫ్టీ నిలబడగలగితే.. 10,500 దిశగా పయనించేందుకు మార్గం ఏర్పడుతుంది. 

“నిఫ్టీ ఇంకా బుల్లిష్ గానే ఉంది. మరింతగా అప్‌సైడ్ వెళ్లే అవకాశాలున్నాయి. అయితే 9750-9830 మధ్య కొంత కరెక్షన్‌కు అవకాశం ఉంది,” అని వే2వెల్త్ బ్రోకర్స్ వర్గాలు చెబుతున్నాయి.

సెక్టార్ల వారీగా చూస్తే ఫార్మా, టెక్నాలజీ కౌంటర్లు ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీలో భాగం అయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్‌ల పరుగులకు కారణం అయ్యాయి.Most Popular