ఎస్‌బీఐ లైఫ్ ఐపీఓకు బోర్డ్ గ్రీన్ సిగ్నల్

ఎస్‌బీఐ లైఫ్ ఐపీఓకు బోర్డ్ గ్రీన్ సిగ్నల్

ఐపీఓ ద్వారా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఐపీఓ రూట్‌లో 8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించగా.. ఇంకా ధర నిర్ణయం కాలేదు. 
రూ. 7000 వేల కోట్ల సమీకరణ కోసం జూలై 7, 2017న ఎస్‌బీఐ లైఫ్‌కు ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతి ఇచ్చింది. 
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత.. దేశంలో ఐపీఓకు వస్తున్న రెండో కంపెనీగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. పీఎన్‌బీ పరిబాస్, సిటి, కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, యాక్సిస్ క్యాపిటల్ సంస్థలను ఐపీఓ నిర్వహణ కోసం తీసకుంది ఎస్‌బీఐ. 

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 70.1 శాతం వాటా ఉండగా.. బీఎన్‌పీ పరిబాస్ కార్డిఫ్‌కు 26 శాతం షేర్ ఉంది. కేకేఆర్, టెమాసెక్‌ కంపెనీలకు ఒక్కోదానికి 1.95 శాతం చొప్పున వాటా ఉంది.

ఐపీఓ ద్వారా 12 శాతం వాటా విక్రయిస్తామని గతంలోనే ఎస్‌బీఐ వెల్లడించగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాతం, బీఎన్‌పీ పరిబాస్ 4 శాతం వాటాలు విక్రయించనున్నట్లు తెలిపింది. Most Popular