మార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు!

మార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు!

మిడ్ సెషన్‌ నుంచీ అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మరింత దూకుడు చూపడంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్ల లాభానికి చేరువైంది. ప్రస్తుతం 393 పాయింట్లు దూసుకెళ్లి 31,753కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 114 పాయింట్లు జంప్‌చేసి 9,780ను తాకింది. ఇవి మార్కెట్‌ చరిత్రలో సరికొత్త గరిష్టాలు కాగా.. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) 2 లక్షల డాలర్లను(ట్రిలియన్లు) చేరింది. అంటే ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ మార్కెట్‌ కేప్‌ రూ. 1,29,62,375 కోట్లను తాకింది. 
ఐటీ అండ
బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా దాదాపు అన్ని ఇండెక్సులూ లాభపడగా.. ఐటీ దాదాపు 3 శాతం జంప్‌చేసింది. దీంతో మార్కెట్లకు ప్రోత్సాహం లభించగా.. టెలికం 4 శాతం ఎగసింది. ఈ బాటలో బ్యాంకింగ్‌, కేపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ సైతం 1 శాతం చొప్పున లాభపడ్డాయి. 
దిగ్గజాల జోరు
సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌ దాదాపు 6 శాతం జంప్‌చేయగా.. టీసీఎస్‌, విప్రో 4.5 శాతం, ఇన్ఫోసిస్‌ 2.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో కోల్‌ ఇండియా, లుపిన్‌, సన్‌ పార్మా, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ తదితరాలు 3-2 శాతం మధ్య పురోగమించాయి. కేవలం ఎంఅండ్‌ఎం, ఐటీసీ అదికూడా స్వల్పస్థాయిలో వెనకడుగు వేశాయి.
చిన్న షేర్లు సైతం 
మార్కెట్‌ జోష్‌ చిన్న షేర్లకూ పాకింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సలు 0.7 శాతంపైగా ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో ఏకంగా 1,595 లాభపడితే.. 966 మాత్రమే నష్టాలతో ఉన్నాయి.Most Popular