షార్ట్‌టెర్మ్‌లో 15శాతం లాభాలిచ్చే టెక్నికల్ పిక్స్!

షార్ట్‌టెర్మ్‌లో 15శాతం లాభాలిచ్చే టెక్నికల్ పిక్స్!

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. గత వారం కన్సాలిడేషన్ ధోరణి చూపించిన ఇండెక్స్‌లు.. ఈ వారం ప్రారంభంలోనే కొత్త రికార్డులను నమోదు చేశాయి. గతేడాది కూడా న్యూ హై లెవెల్స్‌ను టచ్ చేసినా, అక్కడ నిలబడలేకపోయిన ఇండెక్సులు.. ఈ వారం మాత్రం స్ట్రాంగ్‌గా ట్రేడింగ్ ప్రారంభించుకున్నాయి.

9600-9650 లెవెల్‌కు ఎగువన నిఫ్టీ చాలా స్ట్రాంగ్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. డౌన్‌సైడ్ వచ్చేందుకు అవకాశాలున్నా.. 9665 నిఫ్టీకి కీలకంగా ఉండనుందని చెబుతున్నారు. 

క్లోజింగ్ బేసిస్‌లో 9700కు ఎగువన నిఫ్టీ నిలబడగలిగితే, 9800-9850 వరకూ షార్ట్‌టెర్మ్‌లో ర్యాలీ చేయడం ఖాయంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇండెక్స్‌ ఇంత జోరు మీద ఉన్న సమయంలో 3 స్టాక్స్ టెక్నికల్‌గా కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నాయని.. 15 శాతం రాబడులు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

గాయత్రి ప్రాజెక్ట్స్ : BUY| టార్గెట్ రూ. 203 | స్టాప్‌లాస్ రూ. 165 |అప్‌సైడ్ 15%
గత కొన్ని వారాలుగా ఈ స్టాక్ కన్సాలిడేషన్ జోన్‌లో ఉంది. వాల్యూమ్ బ్రేకవుట్ వచ్చిన తర్వాత ఈ కౌంటర్‌లో మూమెంటం పెరిగింది. రూ. 152 లోయర్ స్థాయిని నమోదు చేసిన తర్వాత.. వీక్లీ బేసిస్‌గా 10శాతం పైగా పెరిగింది.

ఈ స్టాక్‌లో ఇంకా కొనుగోళ్లకు అవకాశం ఉందని, రాబోయే సెషన్స్‌లో కూడా బుల్లిష్ ధోరణి కొనసాగించవచ్చని టెక్నికల్ ట్రెండ్ చెబుతోంది. రూ. 182 వరకూ ఈ స్టాక్ ర్యాలీ చేసే అవకాశం ఉండగా.. ఆ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురు కానుంది.

 

బాటా ఇండియా: BUY| టార్గెట్ రూ. 620 | స్టాప్‌లాస్ రూ. 545 | అప్‌సైడ్ 9%
గత వారం ప్రారంభంలో కన్సాలిడేషన్ జోన్‌లో ఉన్న ఈ స్టాక్, వారాంతాని కల్లా పాజిటివ్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. వాల్యూమ్స్ పెరగడంతో గత వారం 7 శాతం పెరిగిన ఈ స్టాక్, ఈ  వారం కూడా లాభపడే అవకాశాలున్నాయి. 

రూ. 552 దగ్గర మంచి సపోర్ట్ ఉన్న బాటా ఇండియాకు, రూ. 592 దగ్గర రెసిస్టెన్స్ ఎదురుకానుంది. ఈ లెవెల్ దగ్గర బ్రేకవుట్ తీసుకుంటే, రూ. 630 లెవెల్ వరకూ వెళ్లే అవకాశాలున్నాయి.

 

ఒబెరాయ్ రియాల్టీ: BUY | టార్గెట్ రూ. 415 | స్టాప్‌లాస్ రూ. 367 |అప్‌సైడ్ 9%
గత నెలలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కున్న ఒబెరాయ్ రియాల్టీ, కనిష్టంగా రూ. 338కు చేరుకుంది. బుల్లిష్ రివర్సల్ ట్రెండ్‌ను తీసుకోవడంతో, ఈ స్టాక్ అప్‌ట్రెండ్‌లోకి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

వీక్లీ బేసిస్‌లో 5 శాతం తగ్గిన ఈ స్టాక్, టెక్నికల్‌గా డౌన్ ట్రెండ్‌ను సూచిస్తోంది. అయితే.. అప్పర్ రెసిస్టెన్స్‌కు ఎగువన ట్రేడ్ అవుతుండడంతో రూ. 373 దగ్గర సపోర్ట్ తీసుకోనుంది. 
 Most Popular