ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లిస్టింగ్ గ్రేట్‌‌!

ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లిస్టింగ్ గ్రేట్‌‌!

ఇటీవల విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(ఎస్‌ఎఫ్‌సీ) భారీ లాభాలతో బీఎస్‌ఈలో లిస్టయ్యింది. ఎన్‌ఎస్‌ఈ సాంకేతిక సమస్యల కారణంగా ట్రేడింగ్‌ అప్‌డేట్‌ కాకపోగా.. బీఎస్‌ఈలో 47 శాతం ప్రీమియంతో రూ. 525 వద్ద లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 358కాగా.. రూ. 167 లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం రూ. 524 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూకి ఏకంగా 54 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించిన సంగతి తెలిసిందే. తద్వారా కంపెనీ రూ. 1,912 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 358 ధరలో యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 563 కోట్లను సమీకరించింది. 
కంపెనీ వివరాలివీ
1966లో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఏయూ ఫైనాన్షియర్స్‌గా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ ఎన్‌బీఎఫ్‌సీగా రిజర్వ్‌ బ్యాంక్‌ గుర్తింపు పొందింది. ఉత్తరాది మార్కెట్లలో రిటైల్‌ ఫైనాన్సింగ్‌పై ప్రధానంగా దృష్టిపెట్టింది. మధ్య, తక్కువ స్థాయి ఆదాయం ఆర్జించే వ్యక్తులకు రుణాలివ్వడం ద్వారా బిజినెస్‌ పెంచుకుంటూ వచ్చింది. ఈ బాటలో 2016 డిసెంబర్‌ 20న రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(ఎస్‌ఎఫ్‌బీ) లైసెన్స్‌ సాధించింది. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలు మూడు ప్రధాన విభాగాలలో విస్తరించాయి. వెహికల్‌ ఫైనాన్స్‌, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ), చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎస్‌ఎంఈ) విభాగాలకు రుణాలు అందిస్తోంది. సుమారు 10 రాష్ట్రాలలో 300 బ్రాంచీలను ఏర్పాటు చేసింది. Most Popular