వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్.. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయచ్చా?

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్.. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయచ్చా?

చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాల్లో పెట్టుబడులపై వడ్డీ రేట్లను, కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తోంది. 

గత కొంతకాలంగా ఈ తగ్గుదల కాసింత ఎక్కువగా ఉందనే చెప్పాలి. 2015-16లో పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.7 శాతంగా ఉండగా, ఈ ఏడాది 7.8 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 9.3 శాతం నుంచి 8.3 శాతానికి తగ్గింది. ఆడ పిల్లల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి స్కీమ్‌లో 9.2 శాతం నుంచి 8.3 శాతానికి వడ్డీ తగ్గింది. అలాగే నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 8.5 నుంచి 7.8 శాతానికి తగ్గింది.

ఈ ట్రెండ్ కారణంగా మీరు అభద్రతా భావానికి లోనవుతున్నారా? ఈ స్కీమ్‌లలో పెట్టుబడులను పెంచడంపై సందిగ్ధంలో ఉన్నారా?"రిటైర్‌మెంట్ కార్పస్ నిధి కోసం ఆలోచించేవారు, దీర్ఘకాలంలో రాబడుల కోసం చూసేవారు, ఇన్‌ఫ్లేషన్‌ను మించి రాబడులు అందించే ఇతర పెట్టుబడి సాధనాలను పరిశీలించవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర పథకాలతో పోల్చితే. చిన్న మొత్తాల పథకాలు దీర్ఘకాలంలో మంచి వడ్డీ రేట్లను  అందించలేకపోవచ్చు. 25-45 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు ఎస్ఐపీ(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) వంటి వాటిని పరిశీలించవచ్చు" అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మీరు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నా, ఇప్పటికే పదవీ విరమణ చేసినా, మీరు ప్రస్తుత పథకాల్లోనే కొనసాగడం మంచిది. 55-65 ఏళ్ల మధ్యలో ఉన్నవారు.. వడ్డీ రేట్లు తగ్గుతున్నా చిన్న మొత్తాల పొదువు పథకాల్లోనే కొనసాగితే, ఈ పథకాల్లో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

అయితే, కొంత రిస్క్ ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు చేయాలని భావించేవారు, తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో వీటి స్థాయిని తక్కువ మొత్తానికి  పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. పెట్టుబడి మొత్తంలో వ్యక్తికి వ్యక్తికి తేడాలు ఉన్నా.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్లలలో 20 శాతానికి మించకుండా పెట్టుబడులు చేయడం ఉత్తమం.

బ్యాంకులలో డిపాజిట్ స్కీమ్‌లతో పోల్చితే, ఈ పథకాల్లోనే ఎక్కువ రాబడులు అందుతున్నాయంటూ తాజాగా ఇక్రా నివేదిక వెల్లడించింది. లిక్విడిటీ తక్కువగా ఉన్న సమయాలతో పోల్చితే, ఇప్పుడు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లకు కట్టుబడి ఉండడం అంత సమంజసం కాదు. అయితే, బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే వీటిలో వడ్డీ రేట్ల తరుగుదల తక్కువగానే ఉండడాన్ని గమనించాలి.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేటును 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ యీల్డ్‌తో ముడిపడి ఉంటుంది. ప్రతీ త్రైమాసికం చివరన వీటిని రివైజ్ చేస్తారు. మార్కెట్‌కు అనుసంధానంగా ఉంచేందుకు గాను గవర్నమెంట్-సెక్యూరిటీ యీల్డ్‌తో ఇవి జత చేసి ఉంటాయి.Most Popular