జీటీపీఎల్‌ హాథవే నేడు లిస్టింగ్‌

జీటీపీఎల్‌ హాథవే నేడు లిస్టింగ్‌

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న జీటీపీఎల్‌ హాథవే నేడు(4న) స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 167-170కాగా.. తద్వారా కంపెనీ సుమారు రూ. 500 కోట్లను సమీకరించింది. గుజరాత్‌లో నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్న కేబుల్‌ ప్రొవైడర్‌ జీటీపీఎల్‌ హాథవే పబ్లిక్‌ ఇష్యూకి అంతమాత్రంగానే స్పందన వచ్చింది. జూన్‌ 23న ముగిసిన ఇష్యూకి 1.53 రెట్ల స్పందన లభించింది. 
ఇదీ సబ్‌స్క్రిప్షన్‌ తీరు
కంపెనీ 2.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.08 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) కోటాలో 1.48 రెట్లు, సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి 2.85 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించగా.. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 94 శాతమే దరఖాస్తులు వచ్చాయి. 
ఇష్యూకి ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 145 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 170 ధరలో డీబీ ఇంటర్నేషనల్ ఏషియా‌, బీఎన్‌పీ పరిబాస్‌ ఎంఎఫ్‌ తదితర సంస్థలకు మొత్తం 85 లక్షలకుపైగా షేర్లను కేటాయించింది. 
స్టాక్‌ మార్కెట్‌ లిస్టెడ్‌ సంస్థ హాథవే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ కంపెనీకి మాతృ సంస్థకాగా..  కంపెనీ పలురాష్ట్రాలలోని 169 పట్టణాలలో డిజిటల్‌ కేబుల్‌ సర్వీసులను అందిస్తోంది. 5.41 మిలియన్లమంది సబ్‌స్ర్కైబర్లను కలిగి ఉంది. Most Popular