మూడేళ్లలో సంపద రెట్టింపు చేసిన మ్యూచువల్ ఫండ్స్

మూడేళ్లలో సంపద రెట్టింపు చేసిన మ్యూచువల్ ఫండ్స్

మార్కెట్లు గత ఏడాదిగా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జనవరి ప్రారంభం నుంచి ఇండెక్స్‌లలో పరుగు కనిపిస్తోంది. అనేక సెక్టార్లు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందుకే వెల్త్ అడ్వైజర్లు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు చేయాలని సూచిస్తారు. లార్జ్‌క్యాప్ నుంచి మిడ్‌క్యాప్ వరకూ పలు విభాగాల్లో మార్కెట్‌లో పెట్టుబడులు చేయడంతో.. ఈ మల్టీక్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారుతున్నాయి, మదుపర్లకు లాభాలు పంచుతున్నాయి.

 

మార్కెట్స్ నుంచి అందిన సహకారంతో కొన్ని మల్టీక్యాప్ ఫండ్స్ అనతి కాలంలో ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేయగలిగాయి. గత మూడు, నాలుగేళ్లుగా ఫండ్ మేనేజర్లు తమకు గల మార్పిడి సౌలభ్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పచ్చు. ఎక్కువ రాబడులు అందిస్తున్న మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయింపులు పెంచుతూ, ఆ రాబడిని లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోకి మార్చుతున్న తీరు ఆకట్టుకుంటోంది. 

 

మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ 35 ఫండ్
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ: రూ. 6,785 కోట్లు 
ఫండ్ మేనేజర్: గౌతమ్ సిన్హా రాయ్
పెట్టుబడి రెట్టింపు అయేందుకు పట్టిన సమయం: 1,042 రోజులు (2.85 ఏళ్లు) 
1 ఏడాది రాబడి (%): 34.54 
టాప్ 3 హోల్డింగ్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్
టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్ వాటా (%): 64.67 

మార్కెట్ కేపిటలైజేషన్‌తో సంబంధం లేకుండా ఈ ఫండ్‌లో స్టాక్స్ ఎంపిక చేస్తున్నారు. 2014లో దీన్ని ప్రారంభించినపుడు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లకు సమానమైన వెయిటేజ్ ఇచ్చారు. మిడ్‌క్యాప్ స్పేస్‌లో వాల్యుయేషన్స్ పెరగడంతో, హోల్డింగ్స్‌లో వాటి వాటాను తగ్గించి, ఇప్పుడు పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్స్ వాటా 75 శాతానికి చేర్చారు. ఫైనాన్షియల్ స్టాక్స్‌ ముఖ్యంగా రిటైల్ బ్యాంక్స్, హౌసింగ్ స్టాక్స్‌కు ఈ ఫండ్ ఓవర్ వెయిటేజ్ ఇచ్చింది. 

 

ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 6,527 కోట్లు
ఫండ్ మేనేజర్: రోషి జైన్, ఆనంద్ రాధాకృష్ణన్, శ్రీకేషన్ కరుణాకరన్ నాయర్
1 ఏడాది రాబడి (%): 24.06 
పెట్టుబడి రెట్టింపు అయేందుకు పట్టిన సమయం: 1,131 రోజులు (3.10 ఏళ్లు) 
టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్ వాటా (%): 60.15 
టాప్ 3 హోల్డింగ్స్: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్

కంపెనీ విలువ, ప్రైస్ టు ఎర్నింగ్స్ నిష్పత్తి, ఫార్వార్డ్ ప్రైస్ టు సేల్స్ రేషియా, డిస్కౌంటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ వంటి కీలకమైన పారామీటర్స్‌ను తీసుకుని ఈ ఫండ్ మేనేజర్, స్టాక్స్‌ను గుర్తించడం జరుగుతోంది. వాల్యుయేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ ఫండ్‌లో గ్రోత్ అంశాన్ని పట్టించుకోవడం లేదు. మిడ్‌క్యాప్ వాల్యుయేషన్స్ పెరిగిపోవడంతో, వాటి వాటాను 20 శాతానికి తగ్గించి, లార్జ్‌క్యాప్‌కు 80 శాతం వాటా ఇచ్చారు. ఫైనాన్షియల్స్‌కు ఓవర్‌వెయిట్ ఇచ్చే ఈ ఫండ్, ఎఫ్ఎంసీజీకి అండర్‌వెయిటేజ్ ఇస్తోంది. 

 

కోటక్ సెలక్ట్ ఫోకస్
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 11,042 కోట్లు
ఫండ్ మేనేజర్: హర్ష ఉపాధ్యాయ
1 ఏడాది రాబడి (%): 28.11 
పెట్టుబడి రెట్టింపు అయేందుకు పట్టిన సమయం : 1,138 రోజులు (3.11 ఏళ్లు) 
టాప్ 3 హోల్డింగ్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్ వాటా (%): 37.94 

టాప్-డౌన్ విశ్లేషణలతో ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను బాటమ్-అప్ పద్ధతిలో ఈ ఫండ్‌లో ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే నిరూపించుకున్న బిజినెస్ మోడల్స్‌ను, లాభదాయకతకు అవకాశం ఉన్న కంపెనీలను పోర్ట్‌ఫోలియోలో జత చేసత్ున్నారు. స్టాక్ లెవెల్‌లో డైవర్సిపైడ్ ఎంపిక కనిపిస్తుంది. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్ ఉండడం విశేషం. మార్కెట్స్ లాభాలు పెరుగుతున్న కొద్దీ లార్జ్‌క్యాప్ వాటా పెంచి 80 శాతం నిధులను వాటికే కేటాయించారు.

 

బిర్లా సన్‌లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 3,549 కోట్లు
ఫండ్ మేనేజర్: సత్యబ్రత మొహంతి
పెట్టుబడి రెట్టింపు అయేందుకు పట్టిన సమయం: 1137 రోజులు (3.11 ఏళ్లు) 
1 ఏడాది రాబడి (%): 30.41 
టాప్ 3 హోల్డింగ్స్: మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, యస్ బ్యాంక్
టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్ వాటా (%): 39.11 

ఆర్థికంగా బలంగా ఉన్న మేనేజ్మెంట్స్, మంచి అభివృద్ధికి అవకాశం ఉన్న మోడల్స్‌ను ఈ ఫండ్ మేనేజర్ ఎంపిక చేసుకుంటారు. ఎక్కువ రిస్క్ తీసుకునేవారికి ఈ ఫండ్ ఉపయోగకరం. ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్స్‌కు ఓవర్‌వెయిటేజ్ ఇచ్చే ఈ ఫండ్, ఎఫ్ఎంసీజీ-ఫార్మాలకు అండర్‌వెయిటేజ్ ఇస్తోంది. గత ఏడాదిగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండగా, మిడ్‌క్యాప్ వాల్యుయేషన్స్ పెరిగినా 30 శాతం నిధులు వాటికే కేటాయించడం విశేషం. 

 

ఎస్‌బీఐ మాగ్నం మల్టీక్యాప్ ఫండ్
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 2,309 కోట్లు
ఫండ్ మేనేజర్: అనూప్ ఉపాధ్యాయ
1 ఏడాది రాబడి (%): 22.92 
పెట్టుబడి రెట్టింపు అయేందుకు పట్టిన సమయం: 1138 రోజులు (3.11 ఏళ్లు) 
టాప్ 3 హోల్డింగ్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ
టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్ వాటా (%): 33.56 

అన్ని ఎస్‌బీఐ ఫండ్స్ మాదిరిగా ఈ ఫండ్ మేనేజర్‌ కూడా నాణ్యమైన మేనేజ్‌మెంట్‌కు, అభివృద్ధి సంభావ్యత, మూలధనాన్ని నిర్వహించే సామర్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. మార్కెట్ల లాభాలు పెరుగుతున్న కొద్దీ లార్జ్‌క్యాప్ వాటాను 73 శాతం వరకూ పెంచారు. కోల్గేట్, ఎం అండ్ ఎం, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ వంటి కాంట్రా కాల్స్ ఈ ఫండ్‌కు ఎక్కువగా దోహదం చేశాయి.Most Popular