చిన్న షేర్లు ఓకే!

చిన్న షేర్లు ఓకే!

మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ కనిపించింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1412 లాభపడితే.. 1397 నష్టపోయాయి. మిడ్‌ క్యాప్స్‌లో రిలయన్స్‌ కేపిటల్‌, ఏబీ ఫ్యూచర్‌, క్యాస్ట్రాల్, పెట్రోనెట్‌, ఎంఆర్‌పీఎల్‌, జీఎంఆర్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, వొకార్డ్‌, హెచ్‌పీసీఎల్‌, దివీస్‌ లేబ్స్‌ తదితరాలు 6-2 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఐఎఫ్‌బీ, హెచ్‌బీఎల్‌, బీఎల్‌ కాశ్యప్‌, కెల్టన్‌ టెక్‌, చెన్న పెట్రో, గ్రీవ్స్‌ కాటన్‌, వెస్ట్‌కోస్ట్, ట్రిల్‌,  డిష్‌మ్యాన్‌, ఎన్ఎఫ్‌ఎల్‌, అట్లాంటా, దివాన్‌ హౌసింగ్‌ 13-6 శాతం మధ్య జంప్‌చేశాయి.
నష్టపోయినవేమంటే...
ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో అమ్మకాలతో నీరసించిన చిన్న షేర్లూ ఉన్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, ఇండియన్‌ హోటల్స్, సన్‌ టీవీ, బేయర్‌ క్రాప్‌, ఒబెరాయ్‌ రియల్టీ, భారత్‌ ఫోర్జ్‌, ఎన్‌ఎల్‌సీ తదితరాలు 5-1.5 శాతం మధ్య నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్స్‌లో.. ఎన్‌బీసీసీ, ఎంటీ ఎడ్యుకేర్‌, వీమార్ట్‌, రూబీమిల్స్‌, హైగ్రౌండ్‌, తాజ్‌ జీవీకే, విపుల్‌, ప్రకాష్‌, రాజ్‌ టీవీ తదితరాలు 9-4 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular