హెల్త్‌కేర్‌ షేర్ల హెల్దీ ర్యాలీ‌!

హెల్త్‌కేర్‌ షేర్ల హెల్దీ ర్యాలీ‌!

లాభాల మార్కెట్లో ప్రస్తుతం హెల్త్‌కేర్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం ఎగసింది. బీఎస్‌ఈలో డిష్‌మ్యాన్‌, సింజీన్‌, కేడిలా, సన్‌ ఫార్మా, కోప్రాన్‌, మెర్క్‌, వొకార్డ్‌, అలెంబిక్‌, సీక్వెంట్‌ సైంటిఫిక్‌, ఇండొకో, దివీస్‌ లేబ్స్‌, సిప్లా, గ్లన్‌మార్క్‌, పిరమల్‌ తదితరాలు 5-1.5 శాతం మధ్య ఎగశాయి. పలు కంపెనీలు ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి విభిన్న ఔషధాలకు తుది అనుమతులు సాధించడంతోపాటు.. ప్లాంట్ల తనిఖీలలో భాగంగా ఈఐఆర్‌లను అందుకోవడం వంటి అంశాలు ఫార్మా కౌంటర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  Most Popular