వీనస్‌కు నిధుల బూస్ట్‌!

వీనస్‌కు నిధుల బూస్ట్‌!

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్‌) ద్వారా నిధులను సమీకరించనున్నట్లు పేర్కొనడంతో దేశీ ఫార్మా సంస్థ వీనస్‌ రెమిడీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 7.56 శాతం దూసుకెళ్లి రూ. 103.50 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 106 వరకూ ఎగసింది. క్విప్‌ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే అంశంపై ఈ నెల 22న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు కంపెనీ తెలియజేసింది.Most Popular