బీఎస్‌ఈ-500 కొత్త రికార్డ్‌‌!

బీఎస్‌ఈ-500 కొత్త రికార్డ్‌‌!

గత వారం అమ్మకాలతో డీలాపడ్డ మిడ్‌ క్యాప్‌ షేర్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. దీనికి కొన్ని ఎంపిక చేసిన బ్లూచిప్స్‌కూడ జత కలవడంతో తాజాగా బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ కొత్త గరిష్టాన్ని తాకింది. ఉదయం ఒక దశలో 12,127 పాయింట్లకు చేరింది. ప్రస్తుతం 12,100 వద్ద ట్రేడవుతోంది. ప్రయివేట్‌ రంగ బ్యాంకులు, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగ కౌంటర్లు బలపడటం ఇందుకు దోహదం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కేడిలా హెల్త్‌కేర్‌, బయోకాన్‌, టీవీఎస్‌ మోటార్స్‌, ఆల్కెమ్‌ లేబ్‌, ఎస్కార్ట్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఇటీవల కనిష్టానికి చేరిన డిసెంబర్‌ 26 నుంచి చూస్తే..  ఈ సూచీ 13 శాతంపైగా ఎగసింది. ఇదే సమయంలో ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 10 శాతమే బలపడింది. బీఎస్‌ఈ మొత్తం మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)లో 500 ఇండెక్స్ వాటా దాదాపు 92 శాతం కావడం ప్రస్తావించదగ్గ అంశం. కాగా.. 500 ఇండెక్స్‌లో భాగమైన భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌, మణప్పురం ఫైనాన్స్‌, జేపీ అసోసియేట్స్‌, యామినీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సన్‌ టీవీ, ఐడియా, ఏజిస్‌ లాజిస్టిక్స్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా సిమెంట్స్‌ ఇదే కాలంలో 50-110 శాతం మధ్య దూసుకెళ్లడం విశేషం.Most Popular