క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కోసం ఒక అమెరికన్ సంస్థ నుంచి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ లభించడంతో విరించీ లిమిటెడ్ కౌంటర్ హైజంప్చేసింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం ఎగసి రూ. 90 వద్ద ట్రేడవుతోంది. క్యూఫండ్ ఆన్ క్లౌడ్ ప్రొడక్ట్ వినియోగానికి సంబంధించి ఈ ఆర్డర్ లభించినట్లు కంపెనీ పేర్కొంది. మూడేళ్లపాటు అమల్లో ఉండే ఈ కాంట్రాక్టులో భాగంగా ఏడాదికి 6 మిలియన్ డాలర్ల ఆదాయం పొందే వీలున్నట్లు వెల్లడించింది.
క్లౌడ్ కంప్యూటింగ్‌తో విరించీ జూమ్
