సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 231 పాయింట్లు ఎగసి 28,532కు చేరగా.. నిఫ్టీ 62 పాయింట్లు జంప్‌చేసి 8,840 వద్ద ట్రేడవుతోంది. 
బ్యాంక్‌ నిఫ్టీ జోరు
ప్రధానంగా బ్యాంక్‌ షేర్లు హైజంప్‌చేయడంతో మార్కెట్లు బలపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 2.4 శాతం దూసుకెళ్లగా.. ఫార్మా 1.4 శాతం ఎగసింది. అయితే ఐటీ, మెటల్‌ ఇండెక్సులు 0.7 శాతం చొప్పున బలహీనపడ్డాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దూకుడు
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దాదాపు 7 శాతం దూసుకెళ్లగా.. సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ 2.3-1.6 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, ఐడియా, టీసీఎస్‌, ఐషర్‌ మోటార్స్‌ 3-1.4 శాతం మధ్య నీరసించాయి.Most Popular