లాయిడ్‌ ఎలక్ట్రిక్‌కు హావెల్స్‌ కిక్‌!

లాయిడ్‌ ఎలక్ట్రిక్‌కు హావెల్స్‌ కిక్‌!

లాయిడ్‌ ఎలక్ట్రిక్‌కు చెందిన కన్జూమర్‌ బిజినెస్‌ను ఎలక్ట్ర్రికల్‌ పరికరాల దిగ్గజం హావెల్స్‌ ఇండియా టేకోవర్‌ చేయనుందన్న వార్తలతో ఈ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో లాయిడ్‌ ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌ దాదాపు 3 శాతం ఎగసి రూ. 333 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క హావెల్స్‌ ఇండియా 1 శాతం నష్టంతో రూ. 427 వద్ద ట్రేడవుతోంది. లాయిడ్‌ కన్జూమర్‌ బిజినెస్‌ను రూ. 1200-1500 కోట్ల  విలువతో హావెల్స్‌ కొనుగోలు చేసే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.Most Popular