నిఫ్టీ మార్పుల ఎఫెక్ట్‌

నిఫ్టీ మార్పుల ఎఫెక్ట్‌

మార్చి 31 నుంచి నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీలలో ఎన్‌ఎస్‌ఈ చేపడుతున్న మార్పుల నేపథ్యంలో ఐడియా, భెల్‌ నీరసిస్తే.. ఐబీ హౌసింగ్‌, ఐవోసీ జోరందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఐడియా 2 శాతం క్షీణించి రూ. 106ను తాకగా, భెల్ 1.7 శాతం నీరసించి రూ. 151కు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.2 శాతం నీరసించి రూ. 124కు చేరాయి. అయితే  ఐవోసీ 2 శాతం పెరిగి రూ. 384 వద్ద, ఐబీ హౌసింగ్‌ 3 శాతం పుంజుకుని రూ. 855 వద్ద, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3 శాతం ఎగసి రూ. 64 వద్ద ట్రేడవుతున్నాయి.  Most Popular