మూడేళ్లలో డీజిల్ కార్లు మాయం అవుతాయా?

మూడేళ్లలో డీజిల్ కార్లు మాయం అవుతాయా?

భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగు కానున్నాయని అంటున్నారు. పర్యావరణ హితం కోసం కావచ్చు పికప్ కోసం కావచ్చు తొందర్లోనే ఈ రకం ఇంధనంతో నడిచే కార్లు భవిష్యత్తులో ఇక కన్పించకపోవచ్చనేది ఇండస్ట్రీని క్లోజ్ గా వాచ్ చేస్తున్నవారి మాట.మారుతి సుజికి తొందర్లోనే తన డీజిల్ వెర్షన్ కారైన సిలేరియో స్మాల్ కార్ ని ఆపేయబోతున్నట్లు చెప్పింది. దేశంలోనే అతి పెద్ద కార్లతయారీ సంస్థ మారుతినోట వెంట ఇలాంటి కామెంట్ రావడం ఆశ్చర్యకరంగా అన్పించవచ్చు  కానీ డీజిల్ వెర్షన్ కార్లకి ఇక కాలం చెల్లినట్లే అని మారుతిసుజికితో పాటు ఇతర కంపెనీలు కూడా అంచనా వేస్తున్నాయ్.ఇందుకు తగిన కారణాలు కూడా సహేతుకంగానే అన్పిస్తున్నాయ్.

మైలైజీ విషయానికి ప్రాధాన్యతనిచ్చే వారు ఎక్కువ అని అంటారు..అలాంటి మన దేశంలో పెట్రోల్ వెర్షన్ కార్లకి డిమాండ్ పెరగడం ఆసక్తికలిగించే అంశంగా చెప్పుకోవాలి. పర్యావరణహితం కోరుకునే దిశగా ఈ ప్రయత్నాలు సాగుతున్నా.కొత్త ఎమిషన్ రూల్స్ కూడా డీజిల్ వెర్షన్ కార్ల తయారీకి ప్రతిబంధకంగా మారుతున్నాయ్ వచ్చే మూడేళ్లలో అమల్లోకి రానున్న కొత్త పర్యావరణ నిబంధనల ప్రకారం తయారయ్యే డీజిల్ కార్ల ధరలు చాలా ఎక్కువ కానున్నాయ్.అది కూడా పెట్రోల్ వెర్షన్ కార్ల పెరుగుదలతో పోల్చితే మరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. 2020 తర్వాత డీజిల్ కార్ల ధరలు పెరుగుతాయ్. అలానే చిన్న తరహా డీజిల్  కార్ల తయారీ ఇకపై నిలిచిపోనుందని ఇండస్ట్రీ అంచనాకి వచ్చింది. ఎందుకంటే భారత్ 6 ఎమిషన్ స్టాండర్డ్స్ ప్రకారం డీజిల్ వెహికల్ తయారీకి అదనంగా మరో 75వేల నుంచి లక్షరూపాయల వరకూ ఖర్చు అవుతుంది. బాలెనో, గ్రాండ్ i10, టాటా టియాగో మూడూ పాపులర్ బ్రాండ్ కార్లు ఇవన్నీ డీజిల్ ఫిట్టెడ్ వెర్షన్లే..ఐతే ఏప్రిల్-సెప్టెంబర్ పీరియడ్లో వీటి అమ్మకాలు 27శాతానికి పడిపోయాయ్.గత నాలుగేళ్లుగా ఈ అమ్మకాలు 47శాతంగా ఉంటూ వచ్చాయ్ 

ఐతే మైలేజీని మాత్రమే కోరుకునే వారి సంఖ్య కూడా ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. యుటిలిటీ వెహికల్స్ బయ్యర్లలో 3శాతం మంది మాత్రమే పెట్రోల్ వెర్షన్ కోరుకునేవారు కాగా.ఇప్పుడా శాతం 16కి చేరింది.టయోటా ఇన్నోవా, ఫార్చూనర్ వంటి వెహికల్స్ కి కూడా ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ తయారవుతున్నాయ్..దీనికి తోడు పెట్రోల్ రేటుకి డీజిల్ రేటుకి కూడా పెద్దగా తేడా లేకుండా ధరల పెరుగుదల ఉంటూ వస్తోంది.గతంలో రెండు ఇంధనాల మధ్య తేడా రూ.20 ఉండగా,ఇప్పుడది 10రూపాయలకి చేరింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో కోర్టులు విధించిన నిబంధనలు కూడా డీజిల్ కార్ల అంతర్ధానానికి కారణం అవుతున్నాయ్. ఢిల్లీ రీజియన్లో రెండు లీటర్లు అంతకంటే పెద్ద కెపాసిటీ ఉన్న డీజిల్ కార్లపై నిషేధం విధించబడింది. అక్టోబర్ నెలలో 13666 డీజిల్ కార్లు అమ్ముడైతే పెట్రోల్ కార్లు 51381 అమ్ముడయ్యాయ్. నవంబర్ నెలలో 12817 డీజిల్ కార్లు విక్రయించబడితే 47081 పెట్రోల్ వెర్షన్ వెహికల్స్ అమ్ముడయ్యాయ్..ఇక డిసెంబర్ నెలకి వచ్చేసరికి డీజిల్ కార్ల విక్రయాలు మరింత తగ్గి 10887 సంఖ్యకి పరిమితమైంది.పెట్రోల్ వెర్షన్ కార్లు మాత్రం 43,308 సేలయ్యాయ్. ఈ క్షీణత కస్టమర్లు, వినియోగదారులలో వస్తున్న మార్పుని తెలియజేస్తోంది.అందుకే ఫ్యూచర్లో ఇక డీజిల్ కార్లు కనుమరుగు కావచ్చనే వాదన బలపడుతోందిMost Popular