నిఫ్టీ నుంచి భెల్‌, ఐడియా ఔట్‌

నిఫ్టీ నుంచి భెల్‌, ఐడియా ఔట్‌

ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ-50లో ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం బీహెచ్‌ఈఎల్‌(భెల్)‌, ఆదిత్య బిర్లా మొబైల్‌ టెలికం సంస్థ ఐడియా సెల్యులర్‌ చోటు కోల్పోనున్నాయి. మార్చి 31 నుంచి నిఫ్టీకి ఈ రెండింటి స్థానంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇదే విధంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కు చోటు లభిస్తోంది. ఇందుకు వీలుగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను జాబితా నుంచి తప్పించనున్నారు. ఇక నిఫ్టీ 100 ఇండెక్స్‌లో అపోలో హాస్పిటల్స్‌, భారత్‌ ఫోర్జ్‌, క్యాస్ట్రాల్‌ చోటు కోల్పోనున్నాయి. వీటి స్థానంలో ఐసీఐసీఐ  ప్రుడెన్షియల్‌ లైఫ్‌,  పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌(ఆర్‌ఈసీ) జాబితాలో చేరనున్నాయి. Most Popular