బయోకాన్‌లో హుషారు తెచ్చిన క్యాన్సర్ డ్రగ్

బయోకాన్‌లో హుషారు తెచ్చిన క్యాన్సర్ డ్రగ్


ఇవాల్టి ట్రేడింగ్‌లో బెంగళూరుకు చెందిన ఔషధ తయారీ సంస్థ బయోకాన్ షేరుకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మైలాన్‌కు చెందిన బయోలాజికల్స్ లైసెన్స్ అప్లికేషన్‌ MYL-1401Hకు అనుమతులు లభించడంతో.. ఈ స్టాక్ లాభాలు నమోదు చేస్తోంది

న్యూలెస్టా మాదిరిగా యాంటీ క్యాన్సర్ డ్రగ్‌ను తయారు చేసేందుకు బయోకాన్‌కు అనుమతులు వచ్చాయి. ఒక దశలో 3 శాతం పైగా పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1123ను తాకిన ఈ షేర్ ధర.. ప్రస్తుతం కొంత దిగి వచ్చింది.

ప్రస్తుతం బీఎస్ఈలో 1.77 శాతం పెరగి రూ. 1114 దగ్గర బయోకాన్ షేర్ ట్రేడ్ అవుతోంది. Most Popular