హలోల్‌ నుంచి షిఫ్ట్ చేస్తున్న సన్‌ఫార్మా 

హలోల్‌ నుంచి షిఫ్ట్ చేస్తున్న సన్‌ఫార్మా 


గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న ఫెసిలిటీ.. సన్ ఫార్మాకు చాలా కీలకం. యూఎస్‌లో విక్రయించే ఔషధాల్లో 10-15 శాతం ఇక్కడి నుంచే తయారవుతాయి.

అయితే హలోల్ ప్లాంట్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి అబ్జర్వేషన్ లెటర్ అందడంతో.. ఇక్కడి నుంచి కీలకమైన ఉత్పాదనలను వేరే ప్లాంట్లకు తరలించనున్నట్లు సన్ ఫార్మా వర్గాలు ప్రకటించాయి.

ఈ వార్తలతో సన్ ఫార్మా షేర్ ధర ఇవాళ 3 శాతం పైగా ఊపందుకుంది. ప్రస్తుతం బీఈఎస్ఈలో ఈ షేర్ ధర 4.31 శాతం లాభంతో రూ. 649.30 దగ్గర ముగిసింది. Most Popular