లాభాల ట్రెండ్‌లోకి మారిన మార్కెట్లు

లాభాల ట్రెండ్‌లోకి మారిన మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు ఇవాల్టి ట్రేడింగ్‌లో మంచి లాభాలను నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్ల పరిణమాలు, టీసీఎస్ షేర్ల బైబ్యాక్ వార్తలతో లాభాలతో ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలైనా.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధాన ఇండెక్స్ కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి.

 

మధ్యాహ్న సమయం వరకూ లాభనష్టాల మధ్య ఊగిసలాడిన ఇండెక్సులు.. ఆ తర్వాత మాత్రం జోరందుకున్నాయి. లోయర్ లెవెల్స్‌లో.. ప్రధానంగా ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్ కౌంటర్లలో కొనుగోళ్లతో సూచీల లాభాలు అంతకంతకూ పెరిగాయి. ట్రేడింగ్ చివరకు ఇండెక్సులు.. రోజు గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం.

 

యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో మొదలైనా మన మార్కెట్లలో జోష్ పెరగడం విశేషం. స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి నాలుగు గ్రూప్ బ్యాంక్‌లను విలీనం చేసుకునేందుకు కేబినెట్ అనుమతి లభించడం.. బ్యాంకింగ్ కౌంటర్‌కు జోష్ ఇచ్చింది. టీసీఎస్.. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనల వార్తలు కూడా ఆ రంగంలోని షేర్లలో భారీ కొనుగోళ్లకు కారణమయ్యాయి. Most Popular