వీమార్ట్ రిటైల్ షేర్లో ర్యాలీ కొనసాగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో 50 శాతం లాభపడ్డ ఈ స్టాక్ ధర.. ఇవాళ కూడా ర్యాలీ చేస్తోంది. ప్రమోటర్లు వాటా తగ్గించుకోవడంతో ఈ స్టాక్ భారీగా లాభపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.740కి ఎగసిన వీమార్ట్ రిటైల్.. హైయర్ లెవెల్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌కు గురైంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ స్టాక్ ధర 6.72 శాతం పెరిగి రూ. 713.95 దగ్గర ట్రేడ్ అవుతోంది.