జాయింట్ వెంచర్‌తో రిలయన్స్ డిఫెన్స్‌ షేర్ వెలుగులు

జాయింట్ వెంచర్‌తో రిలయన్స్ డిఫెన్స్‌ షేర్ వెలుగులు


రిలయన్స్ గ్రూప్, దస్సాల్ట్ గ్రూప్ లు కలిసి ఉమ్మడి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు అధికారికంగా ఒప్పందానికి వచ్చాయి.

కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు దస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ అని నామకరణం చేయగా.. రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఈ భాగస్వామ్య సంస్థ ఏర్పాటవుతోంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి.. ఎరిక్ ట్రాపర్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. అనిల్ అంబానీ కో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

జాయింట్ వెంచర్ వార్తలతో ఈ స్టాక్‌లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో 2.49 శాతం లాభపడ్డ ఈ షేర్ రూ. 59.60 దగ్గర ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 60.75కు చేరుకున్నా.. స్వల్పంగా లాభాల స్వీకరణతో కొంతమేర దిగివచ్చింది. Most Popular