ఆర్ & డీపై కన్నేసిన బీఈఎల్

ఆర్ & డీపై కన్నేసిన బీఈఎల్


నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్‌లో కూడా వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతోంది. బీఈఎల్‌లో 5 శాతం వాటా విక్రయించాలని యోచిస్తుండగా.. సంస్థాగత మదుపర్లకు బిడ్ల ద్వారా ఈ వాటా విక్రయించనున్నారు. 

ఆర్ అండ్ డీ విభాగంపై వెచ్చించే మొత్తం రాబోయే కాలంలో 12 శాతం పెంచనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏటా రూ. 500- రూ. 700 కోట్లను ఇందుకోసం వెచ్చించబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

వాటా విక్రయం వార్తలతో ఈ కంపెనీ షేర్ ధర ప్రభావితం అవుతోంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేర్ ధర 0.41 శాతం పెరిగి రూ. 1530 దగ్గర ట్రేడవుతోంది. 
 Most Popular