బైబ్యాక్‌పై కూడా ఇన్ఫోసిస్‌లో గందరగోళమే!

బైబ్యాక్‌పై కూడా ఇన్ఫోసిస్‌లో గందరగోళమే!

ఈ నెల 20న జరగనున్న బోర్డ్ మీటింగ్‌లో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలించనున్నట్లు టీసీఎస్ ఇప్పటికే ప్రకటించగా.. మరో దేశీయ ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ కూడా షేర్ల బై బ్యాక్‌పై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బైబ్యాక్ తో పాటు పలు అంశాల పరిశీలించేందుకు బోర్డ్ త్వరలో భేటీ కానుండగా.. ఈ విషయంపై వ్యవస్థాపకులు ఇంకా స్పష్టతకు రాలేదని సమాచారం. 

ముఖ్యంగా షేర్ ధరపై మేనేజ్మెంట్ నిర్ణయానికి ఫౌండర్ గ్రూప్ సుముఖంగా లేదని తెలుస్తోంది. కేపిటల్ అలాకేషన్, సంస్థాగత మద్దతుపై జేపీ మోర్గాన్ సలహాలను తీసుకోనుంది ఇన్ఫోసిస్. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర 1.49 శాతం పెరిగి రూ. 997 దగ్గర ట్రేడవుతోంది. Most Popular