పరాగ్.. పరుగెడుతోంది

పరాగ్.. పరుగెడుతోంది


క్యూ3 ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడంతో పరాగ్ మిల్క్ ఫుడ్స్ నిన్న భారీగా పతనమైన సంగతి తెలిసింది. ఇవాల్టి ట్రేడింగ్‌ ప్రారంభంలో కూడా భారీగా పతనమైన ఈ షేర్.. ఒక దశలో అత్యంత కనిష్ట స్థాయి రూ. 202.00కు చేరుకుంది. 

ప్రారంభంలో నష్టాల్లో ఉన్న స్టాక్‌లో హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. న్యూట్రిషన్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టనున్నామని.. ఏడాదిలోనే 20-22శాతం మార్కెట్ వాటా దక్కించుకుంటామని ప్రకటించింది. 

ఈ ప్రకటన తర్వాత ఈ కౌంటర్‌లో అనూహ్య స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో భారీ నష్టాల నుంచి భారీ లాభాల్లోకి చేరుకుంది ఈ షేర్. ప్రస్తుతం బీఎస్ఈలో 5.51 శాతం లాభంతో రూ. 225 దగ్గర ఈ షేర్ ట్రేడవుతోంది. Most Popular