మరోసారి నాల్కో వాటా విక్రయం!

మరోసారి నాల్కో వాటా విక్రయం!

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీలో వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లో 5 శాతం వాటా విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 75 శాతం వాటా ఉంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. అంటే గతేడాది సెప్టెంబర్‌లో నాల్కోలో వాటా విక్రయం ద్వారా రూ. 2,831.71 కోట్లను కేంద్రం సమీకరించింది. మరోసారి ఆఫర్ ఫర్ సేల్‌ ప్రకటించి రూ. 62.5 - 63.5 ప్రైస్ బ్యాండ్ నిర్ణయించవచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే ఎడెల్వీస్  ఫైనాన్షియల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాప్‌లను లీడ్ బ్యాంకర్స్‌గా ఎంపిక చేసుకున్నారు.  ప్రస్తుతం ఈ స్టాక్ ధర బీఎస్ఈలో 0.62 శాతం పెరిగి రూ. 65.35 దగ్గర ట్రేడవుతోంది.Most Popular